భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సేవా హి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పాటు నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

జడ్పీహెచ్‌ఎస్‌లో స్థానిక హెచ్‌ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన విద్యార్థులకు ‘ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన’ అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.…