భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ జిల్లా యువ నేత గుగులోతు నవీన్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని నవీన్ నాయక్ పేర్కొన్నారు. అవినీతి రహిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఆదరణ ఉందని ఆయన అన్నారు.

…