భారత్ సమాచార్, మెదక్ జిల్లా : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రామాయంపేటలో మంచి స్పందన లభించింది. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో షాజీలుద్దీన్ వెల్లడించారు. వివిధ సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వినతులను స్వీకరించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులు అందాయి. వీటితో…






