భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం ఐదు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో సింగారపు కుమార్, స్థానిక తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.…






