భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఉద్యమకారుడికి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 27న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శీలం స్వామి మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ఉద్యమకారులు, ఫోరం నాయకులు,…






