భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యుల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సంఘ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను సంఘటితం చేసి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో మహిళా సమైక్య సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. మహిళా సంఘాల…






