భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో శివ్వంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మండల పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ చింతల విజయ వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన…






