భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం చదువుల తల్లి సరస్వతి అమ్మవారు చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు.

చంద్రఘంటా రూపంలో అమ్మవారి దర్శనం

నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు సందర్భంగా అమ్మవారిని చంద్రఘంటా రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు.…