భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జవహర్‌లాల్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం శనివారం (నవంబర్ 28) హుస్నాబాద్ మోడల్ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎ. వేణుకుమార్ తెలిపారు.

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. హుస్నాబాద్ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో మొత్తం 185 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.…