భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం వలిగొండ మండలం వెలువర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి పలు అంశాలపై ఆరా తీశారు.

ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ల్యాబ్ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నారా, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని…