భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్షణ చర్యలు చేపడుతూ తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి సూచించారు. వలిగొండ మండలం అరూర్‌ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న ఆమె, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు సాగు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలిపారు.

వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికను…