భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం మండలం సీతారామపురం గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన యువజన నాయకుడు తోట పవన్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను నేరుగా కలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.