భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడం.. ఇదే లక్ష్యంగా గోకవరం మండలంలోని కైలాసగిరి నిర్వాహకులు సుంకర వీరబాబు అందిస్తున్న సేవలకు మరో గుర్తింపు లభించింది. ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించిన మానవతా సంస్థలు కైలాసగిరికి రెండు ఫ్రీజర్లను ఉచితంగా అందజేశాయి. ఈ సహకారంతో గోకవరం మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గతంలో గోకవరం ప్రాంతంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఏర్పాట్ల కోసం రాజమహేంద్రవరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో…






