భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సుస్థిర జీవనశైలి అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీతానగరం మండలంలోని అన్ని గ్రామాల్లో నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వనరుల పొదుపు, ఆరోగ్యకరమైన జీవన విధానాలపై ప్రజలకు వివరిస్తున్నారు.

సీతానగరం PHC వైద్యాధికారులు డా. వి. భవాని, డా. ఇ. యేసు రాణి, డా. ఎం. శైలజ రాణి పర్యవేక్షణలో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.…