భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు వలిగొండ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ దశరథ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.

2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ విద్యార్హత పూర్తి చేసిన పట్టభద్రులు ఓటరు నమోదుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఓటు హక్కు కలిగిన అర్హులు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్…