భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని శేరిల్లా గ్రామ సర్పంచ్ బంజ లావణ్య రవి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశానికి ఆమె హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, ఉదయం అందించే టిఫిన్ వంటి అంశాలపై విద్యార్థులను నేరుగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో భోజన…