భారత్ సమాచార్, మెదక్ జిల్లా : నర్సాపూర్ రహదారిపై చిన్న చింతకుంట గ్రామ గేటు వద్ద ఉన్న బ్రహ్మంగారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని విశ్వకర్మ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామ గేటు వద్ద ఏర్పాటు చేసిన బ్రహ్మంగారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంపై సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఉద్రిక్తతలకు…






