భారత్ సమాచార్, మహబూబాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయాలకు తావు లేకుండా, పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నెల్లికుదురు మండల కేంద్రంలోని గ్రీవెన్స్ సెల్లో సీపీఎం మండల కార్యదర్శి ఇస్సాంపల్లి సైదులు, ఎంపీడీవో సింగారపు కుమార్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకు మాత్రమే…






