భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 10వ వార్డుకు చెందిన రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో BRS 10వ వార్డు కౌన్సిలర్ మద్దెల మాధవి రమేష్ పాల్గొని రేషన్ కార్డు సభ్యులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
…






