భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ కుమార్తె రోషిణి వివాహ వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో గల అద్వయ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గిరీష్ గౌడ్‌తో రోషిణి వివాహం రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వివాహ వేడుకకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రోషిణి, గిరీష్ గౌడ్‌లను ఆశీర్వదించి…