భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టిన ఘటనలో ఓ MBBS విద్యార్థి దుర్మరణం చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన చిన్నశంకరంపేట మండల పరిధిలోని మిర్జాపల్లి గ్రామ శివారులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఎస్సై శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాకుపల్లి గ్రామానికి చెందిన కరబాసి మహేష్ (25), కొండారి జయవర్ధన్…






