భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేటి వేగవంతమైన జీవనశైలిలో అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి వంటి అంశాలు మన పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పేగు సరిగా పనిచేయకపోతే అది కేవలం జీర్ణక్రియకే కాకుండా మన మానసిక ఆరోగ్యానికీ ప్రభావం చూపుతుంది. కాబట్టి గట్ హెల్త్‌ను విస్మరించకూడదు.
1. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు
ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడం లేదా తరచుగా అపానవాయువు సమస్య కలగడం పేగులు బలహీనమవుతున్న మొదటి సంకేతం. ఎక్కువగా వేయించిన పదార్థాలు, సోడా, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం…

