భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వద్దిరాజు సోదరులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కిషన్‌ల సహకారంతో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామపంచాయతీ పరిధి కట్టు కాలువ తండా దుర్గమ్మ ఆలయం ఆవరణలో నీటి వసతి కోసం ఆదివారం బోరు వేయించారు. సర్పంచ్ మలిశెట్టి శోభన్ ఆలయంలో పూజలు చేసి బోరు వేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ పునఃర్నిర్మాణ పనులలో భాగంగా వద్దిరాజుల సహకారంతో బోరు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కొణతం వెంకన్న, మామిడి శోభన్ బాబు మంగ్య నాయక్,…