భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు నమోదయింది. మాజీ వైసీపీ ఎంపీ, ప్రస్తుతం ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును (ఆర్ఆర్ఆర్) కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును పోలీసులు నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది.…