భారత్ సమాచార్, సంగారెడ్డి: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు గుమ్మడిదల మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పర్యటనకు వెళ్తున్న వారిని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని…