భారత్ సమాచార్, కర్నూలు జిల్లా : ఆదోని రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి.కోదండ, దస్తగిరి నాయుడు మాట్లాడుతూ, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఆదోనిని జిల్లాగా ప్రకటించడం అత్యవసరమని కోరారు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు తాలూకాలుతో కూడిన ఈ డివిజన్ భౌగోళికంగా, వాణిజ్యంగా, సాగునీరు–తాగునీరు వనరులతో సమృద్ధిగా ఉందన్నారు. గతంలో రెండో ముంబైగా పేరొందిన…