భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. దుండగులు పాఠశాల కార్యాలయ తలుపులు పగులగొట్టి, లోపలికి చొరబడి బీరువాలను చిందరవందర చేశారు. పలు ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. వరుసగా రెండుసార్లు ఇలా జరగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.






