భారత్ సమాచార్, నేటి ప్రపంచం;
ధన్వంతరిని నారాయణాంశ సంభూతుడిగా భారతీయులు కీర్తిస్తారు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడిగా భారత పురాణాల్లో ప్రస్తావించారు. శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ – క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం అది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు ఉద్భవించారు. పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం తో ఉన్న ఆ రూపాన్ని…

