భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జాతీయ అవార్డు గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్యా మీనన్ తన సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు ఆమె సిద్ధమయ్యారు.

“కేయూరి ప్రొడక్షన్స్” ఆరంభం

గత ఏడాది మూడు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నిత్యా మీనన్, ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. తన సొంత నిర్మాణ సంస్థకు ‘కేయూరి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఒక ప్రత్యేక వీడియో ద్వారా సోషల్…