భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఘర్షణలు మరింత ఉధృతమయ్యాయి. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ ప్రకారం, ఇటీవలి యుద్ధాల్లో పాక్ సైన్యంలో 58 మంది సైనికులు మృతి చెందినట్లు తెలిపారు. పాక్ సైన్యం తరచుగా అఫ్గాన్ గగనతలాన్ని ఉల్లంఘించడం, సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరపడంతో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని ముజాయిద్ పేర్కొన్నారు.

 

తమ భూభాగ రక్షణ కోసం తాలిబన్ దళాలు తగిన ప్రతిస్పందన ఇచ్చాయని, పాక్ ఆర్మీకి చెందిన సుమారు 25 సైనిక పోస్టులను ధ్వంసం చేసినట్లు ఆయన అన్నారు.…