భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండలం తురిమెళ్ల అటవీ శాఖ పరిధిలోని బొల్లుపల్లి బీట్‌లో అనుమానాస్పదంగా పులిపిల్ల మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పులిపిల్ల మృతి చెందడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మృతి చెందిన పులిపిల్లను అటవీ శాఖ అధికారులు పరిశీలించి అది మగ పులిపిల్లగా గుర్తించారు. అయితే పులిపిల్ల మృతికి గల కారణాలు మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. అనుమానాస్పద పరిస్థితుల్లో…


