భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: నవీపేట్ మండలం యంచ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో బుధవారం అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రజల లోకకళ్యాణం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సప్తహ, ఈ ఏడాది 9వసారి జరుగుతోంది. ఏడు రోజుల పాటు నిరంతర హరినామ సంకీర్తనలతో పాటు భజనలు, కీర్తనలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి నాడు ఈ సప్తహం ముగింపు వేడుకలు…