భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుతో పాటు పలువురు నాయకులను పార్టీ శ్రేణులను అరెస్టు చేయడం, నిర్బంధించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు కట్టుకొని సోమవారం మౌన నిరసన తెలిపారు. కామారెడ్డి ఘటనను సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ఎదుగుదలను ఓర్వలేక అక్రమ అరెస్టులు కేసులు బనాయిస్తూ…