భారత్ సమాచార్, సినిమా: బిహార్ రాజకీయాల్లో మరోసారి వివాదం రేగింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ఒక ఎన్నికల సభలో బీజేపీ మహిళా అభ్యర్థి మెడలో స్వయంగా పూలదండ వేసిన ఘటన విస్తృత చర్చకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. సభా వేదికపై నితీశ్ అభ్యర్థి దగ్గరికి వెళ్లి ఆమె మెడలో పూలదండ వేయడానికి ప్రయత్నించగా, పక్కనే ఉన్న జేడీయూ ఎంపీ సంజయ్ జా “దండను ఆమె చేతికి ఇవ్వండి” అని సూచించినప్పటికీ, సీఎం…