భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లి అయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోనమ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పచ్చని పూల మధ్య పింక్ కలర్ డ్రెస్లో బేబీ బంప్‌తో ఫొటోలను పోస్ట్ చేస్తూ తన రెండో గర్భధారణను ప్రకటించారు. ఆ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

సోనమ్ కపూర్ 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్నారు. ఈ…