భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో ఏడు దశాబ్దాలపాటు తన నటనతో చిరస్మరణీయమైన ముద్ర వేసిన ప్రముఖ నటి కామినీ కౌశల్ ఇక లేరు. 98 ఏళ్ల వయసులో ఆమె ముంబైలో కన్నుమూశారు. 1927లో జన్మించిన కామినీ కౌశల్ హిందీ సినీ ప్రపంచానికి తొలి మహిళా స్టార్‌లలో ఒకరుగా గుర్తింపు పొందారు.
1946లో విడుదలైన ‘నీచా నగర్’ చిత్రంతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్ర అవార్డు గెలుచుకోవడం ద్వారా భారత సినిమా ప్రపంచానికి ప్రపంచస్థాయి గుర్తింపు…


