భారత్ సమాచార్.నెట్, కాశ్మీర్: భారీ వర్షాల కారణంగా జమ్మూకాశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వైష్ణో దేవి మందిరానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రకు బ్రేక్ పడింది. ప్రధాన ఆలయానికి చేరుకునే మార్గంలోని అర్థకుమారి గుహ సమీపంలో కొండచరియలు, మట్టి ఒక్కసారిగా పడటంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

 

కొండచరియలు విరిగిపడిన సమాచారం అందుకున్న దేవస్థాన బోర్డు, భద్రతా బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. యాత్ర మార్గంలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దిని…