భారత్ సమాచార్, హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం ప్రజలు అందరికీ తెలుసని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో కూడా అందరికి తెలుసని చెప్పారు.
బీఆర్ఎస్ మొసలి కన్నీరు:
గత బీఆర్ఎస్ పాలనలో భట్టి…





