భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామంలో ఎన్నికల నేపథ్యంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, గ్రామస్థాయి బలోపేత కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నేతలతో కలిసి పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి అందరూ ఒక్కటిగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.