భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి దృష్టిహీన ఉద్యోగుల సంఘం (Visually Challenged Employees Association) నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. దృష్టిహీనులు స్వయం ఆధారంగా ముందుకు సాగుతూ కష్టపడి పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్,…