భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జిల్లాలో కొన్నేళ్లుగా పశువులను దొంగలిస్తూ, అడ్డొచ్చిన వారిని క్రూరంగా రాళ్లు, సోడా సీసాలతో దాడులు చేసిన ముఠాను ఆదోని వన్ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆదోని పట్టణ శివారులో 2 బొలెరో వాహనాలను, కారును స్వాధీనం చేసుకొని, సుమారు 16 మందిని అదుపులోకి తీసుకొన్నట్లు డీఎస్పీ హేమలత తెలిపారు. సుమారు రూ.1.49 కోట్ల విలువ గల 542 పశువులను రికవరీ చేశామన్నారు. 16మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరాలు వెల్లడించారు.