భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ నిత్యం మారిపోతున్నా, చైనా కంపెనీ వివో తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. ఇటీవల ముగిసిన జూలై–సెప్టెంబర్‌ త్రైమాసిక గణాంకాల ప్రకారం, మొత్తం విక్రయాల్లో వివోకు అత్యధిక వాటా లభించింది. మధ్య తరగతి వినియోగదారులపై దృష్టి పెట్టి, బడ్జెట్‌ నుంచి మిడ్‌రేంజ్‌ వరకు విభిన్న మోడళ్లను విడుదల చేయడం వివో విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

 

దేశీయ మార్కెట్లో ఒప్పో, శామ్‌సంగ్‌, యాపిల్‌, రియల్‌మీ, షావోమీ వంటి బ్రాండ్లు పోటీ పడుతున్నప్పటికీ, వివో స్థాయిని ఎవరు దెబ్బతీయలేకపోయారు.…