భారత్ సమాచార్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛ, హక్కులు,…





