భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న “ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ” కార్యక్రమాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ 9 వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.…