భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సీఎం సహాయనిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతోందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల పరిధిలో గురువారం 15మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న 15 మంది సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల 32 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం…