భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపై ఆరా తీసిన కలెక్టర్, విధులకు హాజరు కాని ఎంఎల్‌హెచ్‌పీకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో మాట్లాడి, వైద్య సేవలు, మందుల పంపిణీపై వివరాలు తెలుసుకున్నారు.
సోమక్క ఇందిరమ్మ చీర అందలేదని చెప్పడంతో, కలెక్టర్ వెంటనే మహిళా సంఘాల సభ్యులకు సూచించి ఆమెకు చీరను అందజేశారు. ఈసారి చాలా మంచి చీరలు ఇచ్చారని సోమక్క…





