భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కొండపల్లి గోపాల్‌రావు నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాలనీవాసులతో కలిసి రోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్న నిరసన చేపట్టారు. గతంలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి అప్పటి 22వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగినప్పటికీ, ఇప్పటి వరకు…