భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా: కేంద్రప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం కీసర మండల నాయకులు బంగారు నర్సింగ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అమాంతం పెంచేయడం దుర్మార్గమన్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం వలన రవాణా చార్జీలు…