భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గోనెగండ్ల ప్రాంతంలో అమాయక రైతులను ఆసరాగా చేసుకుని ‘కావేరి’ కంపెనీ పేరుతో నకిలీ మొక్కజొన్న విత్తనాలు విక్రయించి మోసం చేసిన డీలర్ నబీషా, సబ్ డీలర్ మహేష్‌లను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు ఈ మేరకు డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల విక్రయంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నష్టపోయిన…