భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: నేపాల్‌లో యువత ఆధ్వర్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనరేషన్-Z (Gen-Z) ఉద్యమకారులు గురువారం సిమారా ప్రాంతంలో ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం అత్యవసరంగా కర్ఫ్యూ విధించింది. మధ్యాహ్నం 12:45 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ‘ది కాఠ్‌మాండూ పోస్ట్’ వెల్లడించింది.
సిమారా చౌక్ వద్ద భారీ సంఖ్యలో జెన్‌జీ కార్యకర్తలు చేరి నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తమ మద్దతుదారులపై యూఎంఎల్ (UML) పార్టీ కార్యకర్తలు…


